ADB: నిర్లక్ష్యంగా వాహనం నడిపి బజార్హత్నూర్ గ్రామానికి చెందిన మహిళ చేవుల రత్నమాల మృతికి కారణమైన కారు డ్రైవర్ ప్రదీప్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బోథ్ సీఐ గురు స్వామి మంగళవారం తెలిపారు. ప్రదీప్ సోమవారం రాత్రి మద్యం మత్తులో వాహనాన్ని వేగంగా నడిపి ఎడ్ల బండిని ఢీకొట్టినట్లు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.