SKLM: పాతపట్నం గిరిజన సమాజ భవనంలో 69వ ఏపీ అంతర్జాతీయ పాఠశాల క్రీడలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, నాయకత్వానికి మార్గం చూపుతాయని పేర్కొన్నారు.