ప్రకాశం: ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. మంగళవారం కనిగిరిలోని 4వ సచివాలయంలోని ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆధార్ కార్డు నమోదు చేయడంతో పాటు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ అప్డేట్ తప్పనిసరన్నారు. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వంటివాటిని సచివాలయంలోని సరి చేయించుకోవాలన్నారు