CTR: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా నిరక్షరాస్యత నిర్మూలనలో ఆయన ఎంతగానో కృషి చేశారని ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం ఆయన జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.