TG: జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల కలకలం సృష్టించింది. షేక్‌పేట అజీజ్ బాగ్ కాలనీ మౌంట్ మెర్సీ స్కూల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకువచ్చి కొందమంది మహిళలు ఓట్లు వేసేందుకు యత్నించారు. వీరిని పోలీసులు గుర్తించి.. బయటకు పంపించారు. ఇలా ఓట్లు వేసేందుకు పదుల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.