కడప జిల్లా వేముల మండలంలోని పెర్నపాడు, గొల్లలగూడూరు గ్రామాల్లో ఏఓ ఒబులేసు మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో తెగుళ్ల నియంత్రణకు బయో ఇన్సెక్టిసైడ్లు వాడాలని, కలుపు మొక్కలను సమయానికి తొలగించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.