KDP: ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. కడపలోని న్యాక్ బిల్డింగ్లో జరిగిన పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ రాజ్యలక్ష్మి, ఆర్డీవో చిన్నయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.