ASF: వాంకిడి మండలంలోని ఖాతిగూగ గ్రామానికి చెందిన 21 ఏళ్ల గిరిజన బాలింత మాడావి మారుబాయి తీవ్ర రక్తహీనతతో మృతి చెందింది. 8 నెలల గర్భవతి అయిన మారుబాయికి నాలుగు రోజుల క్రితం రక్తస్రావం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. గర్భం కోల్పోయి అనారోగ్యానికి గురైన ఆమెను ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించేలోపే తనువు చాలించింది.