WG: కాళ్ళ జడ్పీ హైస్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డీఈవో నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన ‘కుళ్లిన గుడ్లతో భోజనమా’ అనే వార్తపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉంటే 150 మంది మాత్రమే భోజనం చేస్తున్నారని నివేదికలో తేలిందన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో హెచ్ఎంను సస్పెండ్ చేశారు.