బీహార్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 60.40 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ విడతలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే జరిగిన తొలి విడతలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. కాగా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.