WNP: అమరచింత మండలం సింగంపేట గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొంతకాలంగా రోడ్డు వర్షాలతో గుంతలు పడి దెబ్బతిన్నదని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఇదివరకు ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్లగా ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. కానీ అమలు నోచుకోలేదని వారు వాపోయారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.