భూపాలపల్లి: పట్టణంలోని 18వ వార్డు కాలనీవాసులు మంగళవారం TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ను కలిసి గల్లీ పక్కన కొత్త వైన్ షాప్ ఏర్పాటును ఆపాలని కోరారు. మహిళలకు ఇబ్బంది కలుగుతుందని, గతంలో ధర్నాతో మార్చినా మళ్లీ ప్రారంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవి పటేల్ మాట్లాడుతూ.. ప్రజల పక్షంగా పోరాడతామని, మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన జరుగుతుందని ఎక్సైజ్ SIకి వినతిపత్రం అందజేశారు.