‘గత వైభవం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అక్కినేని నాగార్జున సందడి చేశాడు. గత జన్మల నేపథ్యంలో రాబోతున్న సినిమానే ఇది అని, అలాంటి బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతగా కష్టపడిందో ట్రైలర్ చూస్తేనే అర్థమైందని, ఇది నాలుగు తరాల స్టోరీ అని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతుంది.