AP: రాష్ట్రానికి పెద్దసంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధిక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలు దేశ భవిష్యత్‌కు పునాదులు అని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. నక్కపల్లి స్టీల్‌ప్లాంట్ ద్వారా పెద్దసంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.