KNR: పామాయిల్ సాగుపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వెన్నంపల్లి పాక్స్ పీఐసీ బిల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం రైతు వేదికలో మాట్లాడారు. పామాయిల్ సాగుకు 90-100% సబ్సిడీతో పాటు ఎకరానికి నాలుగు సంవత్సరాల వరకు రూ.4,200 ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, రమాదేవి పాల్గొన్నారు