GDWL: న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం, రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడవ రోజు భీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది.