BDK: పాల్వంచ మండలం శేఖరం బంజర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని LHPS జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ నాయక్ అన్నారు. ఇవాళ డీఈవో, ఎంఈవోకు వినతిపత్రం అందించారు. 1 నుంచి 7వ తరగతి వరకు మొత్తం 118 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారని చెప్పారు. వివిధ కారణాలతో టీచర్లు వెళ్లిపోవడంతో విద్యార్థులకు బోధన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే టీచర్లను నియమించాలని కోరారు.