NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి. సాహిత్య రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-17 నెట్ బాల్ పోటీల్లో ఈ విద్యార్థిని ప్రతిభ కనబరిచిందని ప్రధానోపాధ్యాయుడు మధుపాల్, పీడీ రమేశ్ గౌడ్ తెలిపారు. ఈనెల 21న నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని చెప్పారు.