ADB: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలను ఆదుకోవాలని తుడుందెబ్బ జిల్లా ధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ‘ఛలో ఉట్నూర్’ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 23న ఉట్నూరులో జరిగే ఆదివాసీల బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు.