TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ డివిజన్లోనూ ప్రజలు బయటకు రావడం లేదని మండిపడ్డారు. తమను అంత భయపెట్టాల్సిన కర్మ కాంగ్రెస్ నేతలకు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ‘ఈ నెల 13వ తేదీ వరకే వాళ్లది.. 14వ తేదీ నుంచి తమదే.. ఒక్కొక్కడి లెక్క అప్పుడు తేలుస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.