కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో-2 వై.వి. హరనాథ్ సూచించారు. ఇందులో భాగంగా మండలంలోని బల్లిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి పఠన సామర్థ్యాన్ని అంచనా వేశారు.