AKP: నర్సీపట్నంలో అరుకు కాఫీ మాధుర్యాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు రుచి చూశారు. మంగళవారం సాయంత్రం అరుకు నేటివ్ కాఫీ షాపును ఆయన ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన కాఫీ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో అరకు కాఫీ రుచులు దొరకడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.