ఫరీదాబాద్‌లో మరికొన్ని పేలుడు పదార్థాలను NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 56లో పేలుడు పదార్ధాలను గుర్తించారు. ఇదే ప్రాంతంలో నిన్న 2900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాగా ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే NIA అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.