HYD: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు GHMC ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల తొలగింపు డ్రైవ్ ప్రారంభించింది. మొదటి రోజునే 277 కుక్కలను పట్టుకొని శెల్టర్ హోమ్స్‌కి తరలించారు. వాటికి స్టెరిలైజేషన్, టీకాలు, సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. పౌరుల భద్రత, శుభ్రత కోసం చేపట్టిన ఈ చర్యను వెటర్నరీ, శానిటేషన్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు.