కృష్ణా: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సి.హెచ్. రాజా మంగళవారం పెడన పోలీస్స్టేషన్లో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ ప్రాంగణం, లాక్అప్స్, రికార్డులు, ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్, ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందిని క్రమశిక్షణ, శుభ్రత, రికార్డుల నిర్వహణలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.