బీహార్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 47.62 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విడతలో ముఖ్యంగా పలువురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (JDU) సుపౌల్ నుంచి 8వ సారి పోటీ చేస్తున్నారు. ప్రీమ్ కుమార్ (BJP) గయా టౌన్ నుంచి, తర్కీషోర్ ప్రసాద్- కటిహార్ నుంచి బరిలోకి దిగారు.