AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మత్స్యకారులు చేపట్టిన రిలే నిరసన దీక్షలు మంగళవారం నాటికి 59వ రోజుకు చేరుకున్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు నినాదాలు చేశారు. సముద్రానికి తమను దూరం చేయవద్దని కోరారు. దీనిని రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.