BPT: మద్యం తాగి వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని బాపట్ల ఎస్సై చంద్రావతి చెప్పారు. ఇవాళ బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద ఆమె వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.