VZM: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు 2026 జూన్ నాటికి పూర్తి కానుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నేడు ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర పెట్టుబడులకు గేట్వేగా మారబోతోందన్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీతో ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.