అనకాపల్లి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి మనోహర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో 10 లక్షల జనాభాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ నివేదికలు, ఇతర అటాచ్మెంట్లు అందజేయాలని తెలిపారు.