ఢిల్లీ పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో డాక్టర్ ఇంట్లో తనిఖీలు చేశారు. సహరన్పుర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై యూపీ పోలీసులు దాడి చేశారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని డాక్టర్ ఆదీల్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.