చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ గారి సేవలను స్మరించడం అంటే ఆయన చూపిన మార్గంలో నడవడం” అని పేర్కొన్నారు.