kdp: స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప వ్యక్తి, జాతీయవాది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి కొనియాడారు. మంగళవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అబుల్ కలాం 7 సంవత్సరాల పాటు అభివృద్ధి కోసం కృషి చేసిన అసలైన కాంగ్రెస్ నాయకుడని తులసి రెడ్డి పేర్కొన్నారు.