ADB: తాంసి మండలంలోని పోన్నారి గ్రామంలో ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ మంగళవారం పర్యటించారు. గ్రామానికి వచ్చి ఆయనకు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాలను ఎస్పీకి వివరించారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీతో విన్నవించారు. తహసీల్దార్ లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ రేఖ రఘు, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రమణ ఉన్నారు.