AP: రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. సభ్యులుగా మంత్రి ఆనం, హోంమంత్రి అనిత, మంత్రి అనగాని ఉన్నారు.