AP: అంతర్జాతీయంగా సీబీఎన్ అంటే ఒక బ్రాండ్ అని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీబీఎన్ సీఎంగా ఉన్నారంటే పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ పనిచేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.