BDK: సుజాతనగర్ మండల కేంద్రం నుంచి వేపలగడ్డ వరకు ‘చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బైక్ ర్యాలీ ఎస్పీ రోహిత్ రాజు నిర్వహించారు. మత్తు పదార్థాల బారినపడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అక్రమ గంజాయి రవాణా జరిగితే తమకు తెలపాలని అన్నారు.