బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదైంది. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.