బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర చనిపోయినట్లు వస్తోన్న వార్తలను ఆయన భార్య హేమ మాలిని ఖండించింది. ‘ప్రస్తుతం వస్తోన్న ప్రచారం క్షమించరానిది. చికిత్సకు స్పందించి కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత కలిగిన ఛానెల్స్ ఇలా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తాయి?. ఇది అత్యంత అగౌరవంగా, బాధ్యతారహితంగా ఉంది’ అంటూ పోస్ట్ పెట్టింది.