HNK: కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన బీసీల ధర్మ పోరాట దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రొఫెసర్ వెంకటనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రెండోరోజు దీక్షను ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్ల సాధన బిల్లును కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. వీరి దీక్షకు పలువురు బీసీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.