KMR: జుక్కల్ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీసు సొంత భవన నిర్మాణానికై గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన స్థలాన్ని పోస్టల్ శాఖకు అందించే విధంగా సహకరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అజయ్ తమ్మెవార్ మంగళవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు అజయ్ ఎమ్మెల్యేకు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు.