మధ్యాహ్నం భోజనం తర్వాత చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. అలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దీని వల్ల గ్యాస్, అజీర్తి, కడుపులో మంట సమస్యలు తలెత్తవచ్చు. భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల వ్యవధి తర్వాత నిద్రపోవడం మంచి అలవాటు. అలాగే, తిన్న తర్వాత సిగరెట్ తాగితే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణ సమస్యలకు దారి తీస్తోంది.