TG: కవి అందెశ్రీ అంతిమ యాత్ర లాలాపేట్ నివాసం నుంచి ఘట్కేసర్కు చేరుకుంది. అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, అడ్లూరి తదితరులు హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందెశ్రీ పాడె మోసి నివాళులర్పించారు.