ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన దేశ ప్రజలను కలచి వేసింది. ఈ ఘటనపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఉమర్ ఫొటోను విడుదల చేశారు. అలాగే, ఉమర్ కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.