MHBD: మహబూబాబాద్ పట్టణంలో మైనర్ బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసిన కురవి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన దైద నాగరాజును అరెస్ట్ చేసి అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.