కోనసీమ: ఆలమూరు మండలం పెనికేరులో కేంద్ర బృందం మంగళవారం పర్యటించింది. ఇటీవల సంభవించిన మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న నష్టాన్ని తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంట పొలాల చిత్రాలు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. వైకాపా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబి, మాజీ ఎంపీ చింతా అనురాధ రైతులకు అండగా నిలవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.