BPT: జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తున్న క్లూస్ టీం విభాగానికి ప్రత్యేక వాహనాలు కేటాయించినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద క్లూస్ టీంకు కేటాయించిన వాహనాలను ఆయన పరిశీలించారు. వాహనాలలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. నేర స్థలంలో సాక్ష్యాలను సేకరించడానికి క్లూస్ టీం ప్రాధాన్యత కలిగిందన్నారు.