KRNL: జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.