HYD: డిఫెన్స్‌కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్మెట్ పోలీసుల దాడి చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించి, సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.