AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి కోసం జరగనున్న ఇండియా-యూరప్ సహకారం, గ్రీన్ షిఫ్ట్ సమావేశాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. అనంతరం కొణతాల కుమార్తె వివాహానికి హాజరవుతారు.